చైత్ర కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ సర్కార్

-

సైదాబాద్ లోని సింగరేణి కాలనికి చెందిన చిన్నారి చైత్ర హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే ఉంది. అయితే తాజాగా… చిన్నారి చైత్ర ఇంటికి తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వచ్చారు. ఈ సందర్భంగా  20 లక్షల రూపాయల చెక్కును చిన్నారి చైత్ర తల్లి దండ్రులకు అందజేశారు తెలంగాణా మంత్రులు.

ఆనంతరం చిన్నారి చైత్ర తల్లి దండ్రులను పరామర్శించారు మంత్రులు. అయితే…
తెలంగాణా ప్రభుత్వము ఇచ్చిన చెక్ తీసుకోవడానికి ముందుగా నిరాకరించారు చిన్నారి తల్లి దండ్రులు.
నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలంటూ మంత్రుల ముందు డిమాండ్ చేశారు చైత్ర పేరెంట్స్. చివరకు పోలీస్ అధికారులు కలెక్టర్ నచ్చజెప్పడంతో చెక్కులు తీసుకున్నారు పేరెంట్స్. అలాగే… నిందితుని కి… కటిన శిక్షలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు తెలంగాణ మంత్రులు. కాగా… నిందితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news