తెలంగాణా కరోన : 1050 కేసులు, 4 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోన కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1050 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,56,713 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. ఇప్పటి వరకు 1401 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 16,404గా ఉన్నాయి.

వారిలో 13,867 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,38,908 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,736 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 93.06% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0..54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 41002 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 48,53,169 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 232 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news