తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ భారీగానే పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అయితే నిన్న కరోనా కేసుల నమోదు భారీగా తగ్గింది. అయితే మళ్ళీ ఈ కేసులు ఈరోజు భారీగా నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,103 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,91,386 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 11 మంది మరణించారు. ఇప్పటి వరకు 1127 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,326గా ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,60,933 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 84.08% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.27% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 55,359 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 29,96,001 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 298 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా పరీక్షలు సగానికి తగ్గించడంతోనే కేసులు తగ్గినట్టు చెబుతున్నారు.