బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని సమాచారం. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా అని తేలింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకి ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. దీంతో నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆమెకు కరోనా సోకడంతో బీజీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఇక దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కాస్త తగ్గినట్టు కనిపించినా ఈరోజు తాజా కరోనా బులెటిన్ ప్రకారం కేసులు మళ్ళీ పెరిగాయి. తాజా బులెటిన్ ప్రకారం భారత్ లో కొత్తగా 80,472 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764కి చేరింది. ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ గా ఉండగా 51,87,826 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.