తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా… కొత్తగా 306 కేసులు

-

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 306 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,59,313 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3883 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5,673 గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,49,757 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.40 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69, 422 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,49,17,603 కు చేరుకుంది. ఇక అటు అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలనే నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news