తెలంగాణ ఎంసెట్‌ మే 5,6,7

-

లక్షలాదిమంది రాసే తెలంగాణ ఎంసెట్‌ తేదీని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. మంగళవారం ఉదయం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 2న ఈసెట్‌, మే 5, 6, 7 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఆయా ఎంట్రెన్స్‌ల వివరాలు ఇలా ఉన్నాయి…. ఈసెట్‌ – మే 2
ఎంసెట్‌- మే 5,6,7 తేదీల్లో
అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌ – మే 9, 11 తేదీల్లో
పీఈ సెట్‌ – మే 13
ఐసెట్‌ – మే 20, 21
ఎడ్‌సెట్‌ – మే 23
లాసెట్‌, పీజీలాసెట్‌ – మే 25
పీజీ సెట్‌ పరీక్షను- మే 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
ఈసెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌, ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌, పీఈ సెట్‌ను ఎంజీయూ నల్లగొండ, ఐసెట్‌ను కేయూ వరంగల్‌, ఎడ్‌సెట్‌, లా, పీజీ ఎల్‌ సెట్‌, పీజీ ఈసెట్‌ను ఓయూ హైదరాబాద్‌ నిర్వహిస్తుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news