తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం గత నెల 9,10,11,14 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకి లక్షా 43 వేల 326 మంది దరఖాస్తు చేసుకుంటే లక్షా 19 వేల 184 మంది హాజరు అయ్యారు. అంటే సుమారు 83.19% విద్యార్థులు హాజరు అయ్యారు. అయితే ఈ హాజరు అయిన లక్షా 19 వేల 184 మందికి గాను 89 వేల వేల 834 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు వివరాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇక తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. నవంబర్ రెండో తేదీ వరకు రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. మిగతా సీట్లను కళాశాలలో భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్ కోసం నవంబర్ 4న మార్గదర్శకాలను ప్రవేశాల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.