తెలంగాణాలో ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండే తెలంగాణాలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లాలన్నా, బంగారం లేదా వెండి ఏదైనా తీసుకువెళ్లాలన్నా దానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే.. ఆ నగదును అవినీతి సొమ్ముగా పరిగణించి పోలీసులు సీజ్ చేస్తారు. అదే విధంగా ఇప్పటి వరకు తెలంగాణాలో పట్టుబడిన మొత్తం విలువను చూస్తే… రూ. 300 కోట్ల ను క్రాస్ చేసింది. అందులో రూ. 105 .58 కోట్ల నగదు, రూ. 13 .58 కోట్ల మద్యం, రూ.145 .67 కోట్ల ఆభరణాలు, రూ. 26 .93 కోట్ల విలువైనవి పట్టుబడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలియచేశారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రూ. 18 .01 కోట్ల సొమ్మును జప్తు చేశారు. ఇంకా ఎన్నికలకు నలభై రోజులు ఉన్నందున ఇంకా ఎన్నో కోట్ల నగదును పట్టుకోనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.