Telangana : కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయినా మాజీ మంత్రులు

-

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వానాకాలం విడత వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుతుపవనాలకు ముందు వర్షాలు కురిసి ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ రైతు భరోసా అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కేసీఆర్ హయాంలో రుణమాఫీ కాకుండా మిగిలింది రూ.4వేల కోట్లు మాత్రమేనని, కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్కువ చేసి చూపుతున్నారన్నారు అని విమర్శించారు. అప్పుడే రుణమాఫీ జరిగిందన్నట్లు మీడియా సంస్థలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్‌లైన్ పెట్టారని, అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని.. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా? అని ప్రశ్నించారు.రైతు భరోసాకు అర్హులను ఇప్పటి వరకు ఎందుకు తేల్చలేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version