కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ జెన్ కో లేఖ

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. కేంద్ర ఇంధన నియంత్రణ శాఖ కార్యదర్శి కి లేఖ రాశారు తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిధి లోకి వెళ్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని లేఖ లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరా ల పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది బదిలీ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సూచనలు రాలేదన్నారు. ఆయా బోర్డ్ ల నుండి అందుతున్న సూచనలను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం కు తెలియ జేస్తున్నామని లేఖ లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలు కు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు.