హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు మిర్చి, ఇతర పంటలు నష్టపోయిన రైతుల పొలాలు పరిశీలించారు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అధైర్యపడొద్దు .. అండగా ఉంటామన్నారు. నోటి కొచ్చిన మిర్చి నేలరాలిందని.. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతిందని పేర్కొన్నారు.
రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసమని వెల్లడించారు. దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగడం లేదు.. వ్యవసాయ విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయన్నారు.
మిర్చి రైతులకు తగిన సహాయం ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కారేనని.. ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరాయని.. అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమన్నారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.