ఏపీకి పట్టిన జగన్ వైరస్ ను తరిమికొట్టాలిసిందే.. అప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళి : అచ్చెన్నా

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 26 వ వర్దంతి కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సందర్భాంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని.. ఎన్టీఆర్, టీడీపీ హయాంలోనే దేశంలో సంక్షేమమనే పదం పుట్టిందన్నారు.

రూ. 35 పెన్షన్ పథకాన్ని ఆనాడు ఎన్టీఆరే ప్రారంభించారని చెప్పారు. రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని.. జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అంటూ చురకలు అంటించారు.యువత బయటకి వచ్చి జగన్ వైరస్సును తరిమికొట్టాలి.. అప్పుడే ఎన్టీఆరుకు ఘన నివాళి అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేషుకు కరోనా వచ్చింది అని టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందొద్దని కోరారు. చంద్రబాబు,లోకేష్ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే ఇద్దరు కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఎప్పటి లాగే వారు ఇద్దరు జనాల్లోకి వస్తారన్నారు.