తుంగభద్ర బోర్డు సెక్రెటరీ కి తెలంగాణ రాష్ట్ర ఈఎన్సీ లేఖ రాసింది. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో RDS కి రావాల్సిన 15.9 టిఎంసి నీటిలో 5,6 టిఎంసిలకు మించి అందడం లేదని లేఖలో పేర్కొంది. అదే సమయం లో ఆంధ్రప్రదేశ్ మాత్రం అటూ తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యదేచ్చగా తరలిస్తున్నారని స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్.
కాబట్టి RDS ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయించి RDS కు పూర్తి స్థాయిలో నీటిని అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖలో విజ్ఞప్తి చేసింది. తమ విజ్ఞప్తి పై తొందరగా స్పందించాలని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. కాగా గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య… జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణానది జలాల పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ వివాదంపై కేంద్రం… దిగివచ్చిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది.