ఇంటర్‌ ఫలితాలపై తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు : ఫస్ట్‌ ఇయర్‌ మార్కులే…సెకండ్‌ ఇయర్‌లోనూ!

-

ఇంటర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల రిజల్ట్ క్రైటీరియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ ఇస్తామని ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే… ప్రాక్టీకల్స్ కు వంద శాతం మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం బ్యాక్ లాగ్స్ ఉంటే 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని… ద్వితీయ సంవత్సరం లోను ఆ సబ్జెక్టులకు 35 శాతం మార్కులు ఇస్తామని సర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అలాగే…. ప్రైవేట్ గా పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులకు 35 శాతం పాస్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కూడా కల్పిస్తూ.. తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. కాగా… ఇటీవలే ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news