తెలంగాణాలో రేషన్ పంపిణి విషయంలో సమస్యలు రావడంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కేవలం 15 రోజులు కాకుండా నెల మొత్తం రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ దొరకక అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పరికరాలు పని చేయడం లేదని ఆందోళన వ్యక్తమైంది. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనితో స్పందించిన తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాము అన్ని చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఏ ఇబ్బంది లేదని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై హర్షం వ్యక్తమవుతుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు గాను 1500 ఆర్ధిక సాయం తో పాటుగా 12 కేజీల రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.