తెలంగాణాలో రేషన్ ఇస్తున్నారు… ఇచ్చే సరుకులు ఏంటీ…?

-

కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కడిక్కడ ప్రజలకు ఇబ్బంది రాకుండా తెలంగాణాలో ఆకలి కేకలు లేకుండా జాగ్రత్తలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు అందరికి కూడా రేషన్ సరుకులను అందించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నేటి నుంచి రాష్ట్రంలో రేషన్ పంపిణి కార్యక్రమం మొదలుపెట్టారు అధికారులు.

రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వారిలో 87.59 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. దీనితో ఒక్కో లబ్దిదారుడికీ 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గత పది రోజుల నుంచి అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని గ్రామాలకు తరలించారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బియ్యం తరలింపు కార్యక్రమం చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.36 లక్షల టన్నుల బియ్యం తరలించారు అధికారులు. ఇలా పంపిణి చేయడం వలన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై రూ.1,103 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. నిత్యవసర సరుకులు కొనుక్కునేందుకు ప్రతి రేషన్‌ కార్డు దారుకూ రూ.1,500 చొప్పున ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల పంపిణీకి ఈ-కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌ను అధికారులు వాడుతున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారానే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిని ఆర్బిఐ నిర్వహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news