హాస్టళ్ళలో ఉండే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

-

ప్రభుత్వ హాస్టల్ల లో ఉండే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూళ్లు కాలేజీలను తెరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిదశలో పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను తెరుస్తున్నట్టు ప్రకటించింది. దసరా తర్వాత ప్రభుత్వ హాస్టళ్లను తెరవాలని ఆదేశించింది. అంతే కాకుండా హాస్టల్లలో సరైన వసతులు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది.

గిరిజన ,ఎస్సి సంక్షేమ శాఖ సైతం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా విజృంభణ నేపథ్యం లో ప్రభుత్వ హాస్టళ్లను మూసివేశారు. ఇక ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం కాలేజీ లు తెరవడం జరిగింది. విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగిపోయింది. ఇక హాస్టళ్ల లో ఉంటూ చదువుకునే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్ల ను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version