విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఇప్పటికే మైనారిటీల కోసం తెలంగాణా ప్రభుత్వం చాలా పధకాలు ప్రవేశ పెట్టింది. తాజాగా విదేశాల్లో చదవాలనుకునే మైనారిటీలకి తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే వికారాబాద్‌ జిల్లాలోని మైనార్టీ వర్గాల వారు ఎవరైనా విదేశాల్లో విద్య నభ్యసించాలని అనుకుంటే వారి కోసం సీఎం ఓవర్సీస్‌ ఉపకార వేతనాల పధకం ఉంది.

Government if Telangana
Government if Telangana

వారి అభ్యున్నతి కోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్‌ ఉపకార వేతనాల పథకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎస్‌ మోతిలాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తెలంగాణా ఈ పాస్ వెబ్ సైట్ ద్వారా అప్ప్లై చేసుకోవచ్చు. ఒక వేళ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని మైనార్టీ సంక్షేమ కార్యాలయం రూమ్ నెం 6 లో సంప్రదించాలని కోరారు.