ఆరోగ్యం మన చేతుల్లోనే…పాటించాలిసిన చిట్కాలు…!

-

మారుతున్న జీవన శైలిలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మనం తినే ఆహారాల వల్ల ఇంకా కాలుష్యం పెరగడం వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు డాక్టర్ దగ్గరకు వెళ్ళని వారు అంటూ ఉండటం లేదు. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మనం మన దినచర్యలో కొంత సమయం మన కోసం కేటాయించుకుని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పని ఉండదు. మనం ఈ రోజుల్లో సరైన సమయానికి తినక పోవడం, సరైన సమయానికి నిద్రించక పోవడం వల్ల కూడా అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము.

అందుకే ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక అర గంట వ్యాయామం చేయాలి. పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఉదయం నిద్ర లేచిన మూడు గంటల లోపుగా తేలికగా జీర్ణమయ్యే అల్పాహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు మద్యాహ్నం 2 గంటల లోపు కొంచెం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవచ్చు. తరువాత నుంచి మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి 7 గంటల లోపు ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజు పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవాలి. రోజు మొత్తంలో ఏదైనా ఒక పండు తినాలి.  రోజుకి 12 గ్లాసుల నీటిని తాగాలి.

రోజు ఒక గ్లాస్ రాగి జావ తాగాలి. రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగాలి. ఉదయం ఒక కప్పు మొలకలు తినాలి. దంపుడు బియ్యం రోజు ఆహారం లో చేర్చుకోవాలి. కాకరకాయ కూర తరచూ తినాలి. అన్నంలో రోజుకి అర స్పూన్ నెయ్యిని వాడాలి. వారానికి మూడు సార్లు గుడ్డు తినాలి. పంచదార బదులు బెల్లం వాడాలి. వంటకి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వాడాలి. రాగి, ఇత్తడి లేదా మట్టి కుండలో నీటిని తాగాలి. రోజుకి 2 గంటలైనా శరీరానికి ఎండ తగలాలి. అప్పుడప్పుడు సున్నుండలు, వేరుశనగ లేదా నువ్వుల ఉండలు తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news