కొత్త సెక్రటేరియట్.. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన ఫోటో..!

-

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. త్వరలోనే ఈ కొత్త డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. కాగా, పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version