తెలంగాణ లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ లో ఏపికి చెందిన ఉద్యోగులు పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత రాష్ట్రానికి వెళ్ళాలంటే వెలొచ్చ్చని పేర్కొంది. ఏపీ ఉద్యోగులు శాశ్వత బదిలీ పై సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాలి అనుకునే ఉద్యోగులు తమ శాక హెచ్ఓడీ కి వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

Postoffice
Postoffice

అంతే కాకుండా బదిలీ పై వెళ్ళే వాళ్లకు కరువు భత్యాలు ఉండవని స్పష్టం చేసింది. అంతే కాకుండా మరో కండిషన్ కూడా పెట్టింది. క్రమశిక్షణ చర్యలు, విజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నవారికి మాత్రం ఏపీకి వెళ్ళడానికి ఛాన్స్ లేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో సొంత రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కల నెరవేరుతుంది.