తెలంగాణ పెనం నుంచి పొయ్యిలో పడింది: ప్రధాని నరేంద్ర మోడీ

-

మరికొన్ని రోజులలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి . ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పటికీ కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్న తెలంగాణలోని మల్కాజిగిరిలో లోక్సభ నియోజకవర్గంలో ఇక తాజాగా నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడుతూ…గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి NDA ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రూపంలో రెండు విసురురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు అని పేర్కొన్నారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పొడి చేసేశాయి అని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. గొయ్యిలో నుంచి బయటికి వస్తే నుయ్యిలోకి.. పొయ్యిలో నుంచి పొయ్యిలో పడినట్లయింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు.బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన అన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news