కరోనా టెర్రర్‌…తెలంగాణ ఆరోగ్య శాఖ 9 ఆదేశాలు జారీ

-

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఐసోలేషన్ సమయం ఏడు రోజులేనని పేర్కొన్న ఆరోగ్య శాఖ… ప్రైవేటు ఆసుపత్రిలో అనవసరంగా రోగులను చేర్చుకోవద్దని పేర్కొంది. కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నామ్స్ పాటించాలని… ఇష్టానుసారంగా మందులు వాడొద్దని వార్నింగ్‌ ఇచ్చింది. ఖరీదైన మందులను అనవసరంగా రోగులకు ఇవ్వొద్దని… కాక్ టెల్స్ రోగులకు పని చేయడం లేదని తెలిపింది.

ప్రజలపై, రోగుల పై ఆర్థిక భారం మోపొద్దని.. ప్రైవేటు, సొంత వైద్యం పనికి రాదని తెలిపింది. లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని… నిపుణులైన వైద్యుల సలహాలు మాత్రమే పాటించండని హెచ్చరించింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని… ఈ తొమ్మిది అంశాలు పాటించాలని స్పష్టం చేసింది.

1) మాస్క్ ధరించండి

2) గుంపులు గుంపులుగా ఉండొద్దు

3) వెలుతురులో ఉండండి

4) వ్యాక్సిన్ తీసుకోండి

5) డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి.

6) అనవసరంగా ఆసుపత్రిలో చేరకండి.

7) అనవసర మందులు వాడొద్దు

8) అనవసర ఆందోళనలు వద్దు

9) లక్షణాలు ఉంటే పరీక్ష చేసుకోవాలి

తొమ్మిది రకాల మందుల తో హోమ్ ఐసోలేషన్ కిట్ తో కోటి మందికి ఇచ్చేందుకు సిద్ధం చేశామని.. ఒమిక్రాన్ కేసులు వివరాలు ఇకపై రోజు వారి హెల్త్ బులిటెన్ లో ఇవ్వమని చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ. ఒమిక్రాన్ వైరస్ ప్రజా సమూహాల్లోకి వెళ్ళిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news