డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ఫ్రోఫైల్ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు కానుంది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ఫ్రోఫైల్ ప్రోగ్రాం వేగంగా పూర్తి చేయాలని…వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ హెల్త్ పోఫైల్ లో ప్రస్తుతం, ఎనిమిది టెస్ట్ లుచేస్తున్నారు, అదే తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా అయితే 57 టెస్ట్ లు చేయవచ్చని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
తెలంగాణ డయాగ్నసిస్ లో ఉపయోగించే ఎక్విప్మెంట్ ద్వారా ఆక్యురేట్ గా రిజల్ట్ వస్తాయి. వేగంగా పరీక్షలు నిర్వహించవచ్చని రోజుకు పది టెస్ట్ లు చేయవచ్చన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారం తీసుకోవాలన్నారని… నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ తయారు ఎలా తయారు చేయనున్నారో , ఆ వివరాలను మంత్రి హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం , ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, సుగర్ బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు.
ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుందన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ పరీక్షలు పూర్తయిన వారి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని, అందులో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్లిప్తం చేయటం జరుగుతుందని మంత్రికి వివరించారు. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండలన్నారు. ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి యాక్సిడెంట్ కు గురయినా అతని ఆరోగ్య సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు.