ఈ నెల 28న కేంద్రం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీట్…

-

దేశంలో అన్ని పార్టీలు తమ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్దమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీకి కంటే ఒక రోజు ముందు నవంబర్ 28న కేంద్రం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

పార్లమెంట్

అన్నింటి కన్నా ముఖ్యమైన మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆల్ పార్టీ మీట్ లో కూడా మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సెషన్‌లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2019 కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదించింది. వ్యక్తిగత డేటాకు సంబంధించిన వ్యక్తుల గోప్యతకు రక్షణ కల్పించడానికి బిల్లు ప్రయత్నిస్తుంది.

మరో వైపు టీఆర్ఎస్ పార్టీ ధాన్యం కొనుగోలు అంశాన్ని, టీఎంసీ బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంపై, కాంగ్రెస్ రైతు చట్టాల రద్దుతో , నూతన విద్యుత్ బిల్లులు, ఎంఎస్ పీ బిల్లుల కోసం, సీఏఏ ఎన్ ఆర్ సీ బిల్లులపై పార్లమెంట్లో పట్టుబట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news