తెలంగాణ హెల్త్ స్టేటస్ సిద్ధం చేయండీ..సీఎం కేసీఆర్

-

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రగతి భవనల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…  నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. దీంతో శిబిరాల నిర్వహణ విజయవంతంగా కొనసాగిస్తామన్నారు. ప్రజలకు ఈ తరహా సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 

కంటి వెలుగు మాదిరిగానే చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని సీఎం అన్నారు. వీలైనంత త్వరగా  ఫిబ్రవరి నుంచి ఈ శిబిరాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. ఆ ప్రొఫైల్ ఆధారంగానే హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణను తయారు చేయాలని అధికారులకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని అన్ని వర్గాల వారికి చేరే విధంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news