కార్తికేయ పెళ్లిలో ప్రభాస్, అనుష్క, రాం చరణ్, ఎన్.టి.ఆర్, రానాలు హంగామా – వీడియో

-

రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ మ్యారేజ్ జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా అటెండ్ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రాం చరణ్, ఎన్.టి.ఆర్, రానాలు ఈ పెళ్లి వేడుకకు చేరుకున్నారు. మూడు రోజుల సంగీత్ కార్యక్రమంలో స్టార్స్ హంగామా అంతా ఇంతా కాదు.

ఈ వేడుక అంతా ఓ సినిమాను తలపించేలా ఉందని చెప్పొచ్చు. వ్యాఖ్యాతగా కీరవాణి అందరి హీరోలను ప్రశ్నలగడంతో పాటుగా బరాత్ లో డ్యాన్సులు అబ్బో రాజమౌళి కోసం స్టార్స్ అంతా ఏర్పరచుకున్న ఈ రీ యూనియన్ ఈవెంట్ చూసి స్టార్ ఫ్యాన్స్ అంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు. రేపు అనగా డిసెంబర్ 30న కార్తికేయ మ్యారేజ్ జరుగనుంది.

రెండు రోజుల ముందునుండే హడావిడి మొదలైంది. అంతా ముందే సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈవెంట్ జరుగుతుంది. చూస్తుంటే ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది కార్తికేయ పెళ్లి అనే చెప్పాలేమో..

ఈ వేడుకలో మన స్టార్స్ చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి ఇంకెందుకు మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

Read more RELATED
Recommended to you

Latest news