తెలంగాణ ప్రజలకు ఊపిరి ఆడనివ్వకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలుపెరుగని వర్షాలతో తెలంగాణ ప్రభుత్వానికి దిక్కు తోచని స్థితిలో ఉందని చెప్పాలి. కానీ హైదరాబాద్ GHMC మేయర్ విజయలక్ష్మి తన సిబ్బందిని సక్రమంగా వాడుకుంటూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా చర్యలను తీసుకుంటున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వర్షాలు రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియచేసింది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భారీ వర్షాలు పడనుండగా … ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం. సైదాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సైబరాబాద్, మెదక్ మరియు గద్వాల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతాయని ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించింది.
ఇక ప్రభుత్వం ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించింది, అత్యవసరం అయితే తప్ప బయటకు ఎటువంటి పరిస్థితుల్లో రావద్దని హెచ్చరించింది.