హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాబోయే కొద్దిగంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు నగరంలో హై అలెర్ట్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 26వ తేదీ బుధవారంతో పాటు జులై 27, జులై 28వ తేదీ వరకు విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణపై ఉదృతంగా ఉండడం..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి …తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
అత్యవసర సమయాల్లో సహాయం కోసం 9000113667 నంబర్‌లో సంప్రదించాలని డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చేసిన ట్విట్టర్ ద్వారా కోరింది. అయితే, వాతావరణశాఖ చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా హైదరాబాద్‌లోని ఆరు జోన్ల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అలాగే బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణతో పాటు హైదరాబాద్, పరిసరర ప్రాంతాల్లోనూ పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.