అక్టోబర్ 25 వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. రూల్స్‌ ఇవే

అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా రెండు పరిక్షలని రి షెడ్యూల్ చేశామని… ఆదివారం రోజు కూడా పరీ క్ష ఉంటుందని చెప్పారు. 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు… ప్రశ్నల్లో 50 శాతం పైగా ఛాయిస్ ఉంటుందని… 4 లక్షల 59 వేలు 237 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారన్నారు. 17 వందల 68 పరీక్ష సెంటర్ లు ఏర్పాటు…పరీక్షల నిర్వహణకు వాక్సిన్ తీసుకున్న 25 వేల మంది ఇన్విజిలేటర్స్ నియామకం చేశామని పేర్కొన్నారు.

మూడు సెట్ల ప్రశ్న పత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్లకి చేరాయని… మానసిక నిపుణులను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కావొద్దు, భయ పడొద్దని… విద్యార్థులు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ కి అనుమతి ఇస్తామన్నారు. థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది…. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే ప్రత్యేక రూమ్ లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ సరిపోతుంది.. ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదన్నారు.

ఇప్పటి వరకు 82 శాతం హాల్ టికెట్ డౌన్ లోడ్స్… 3 లక్షల 74 వేల 903 డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఎవరైనా విద్యార్థుల పరీక్ష ఫీ సంబంధిత కాలేజీలు చెల్లించక పోతే అలాంటి వారు ఇంటర్ బోర్డ్ ను సంప్రదిస్తే పరీక్ష రాసే అవకాశం ఇస్తామని… ఇంటర్ మొదటి సంవత్సరం ఎక్కడ చదివారో ఆ జోన్ లోనే పరీక్ష రాయాలన్నారు. ప్రతి సెంటర్ లో మెడికల్ కిట్స్, సానిటైజేషన్ చేస్తామని… కలెక్టర్ ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు.