తెలంగాణ ఇంటర్ రిజల్ట్ కి.. ముహూర్తం ఫిక్స్..!

-

తెలంగాణలోని ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు అందరికీ కూడా గుడ్ న్యూస్. స్పాట్ తో పాటు అన్ని రకాల ప్రక్రియలని పూర్తిచేసిన అధికారులు రిజల్ట్స్ ని ప్రకటించబోతున్నారు. ఈనెల 23వ తేదీన మంగళవారం ఇంటర్ పరీక్ష ఫలితాలని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఒకవేళ ఏదైనా అనుకోని ఇబ్బందులు కనుక వచ్చాయంటే 24వ తేదీన ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ వల్లనే సెకండ్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 23 లేదా 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. సో, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ రిజల్ట్ ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతి తీసుకున్నాక అధికారులు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news