తెలంగాణ ఎంపీ అభ్యర్థుల విద్యార్హతలు ఇవే

-

రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలకు చెందిన 51 అభ్యర్థుల విద్యార్హతల గురించి మీకు తెలుసా. 50 మందిలో మూడో వంతు మంది అనగా 17 మంది అభ్యర్థులు ఇంటర్, ఆలోపే చదువుకున్నారు. ఐదుగురు వైద్యులు, మజ్లిస్ అభ్యర్థితో కలిపి ఐదుగురు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ బరిలో నిలిచారు. పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవారు ఆరుగురు ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివినవారు 11 మంది ఉన్నారు.

అభ్యర్థుల అఫిడవిట్లలలో పొందుపరిచిన విద్యార్హతలు :

అఖిల భారత స్థాయి అధికారులు

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి (మెదక్, బీఆర్ఎస్), రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్ కర్నూల్, బీఆర్ఎస్), మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ (నల్గొండ, స్వతంత్ర అభ్యర్థి) పోటీ చేస్తున్నారు.

విదేశాల్లో చదవుకున్న ఐదుగురు అభ్యర్థులు

ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ (హార్వర్డ్ యూనివర్సిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్), హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ (లండన్, లా), చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి (అమెరికా, ఎంఎస్), పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ (అమెరికా, గ్రాడ్యుయేషన్), భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి (సైప్రస్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు) చేశారు.

వైద్యులు

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వెటర్నరీ సైన్స్లో మాస్టర్స్(ఎంవీఎస్సీ), మల్లు రవి(కాంగ్రెస్), కడియం కావ్య(కాంగ్రెస్), బూర నర్సయ్యగౌడ్(బీజేపీ), సుధీర్కుమార్(బీఆర్ఎస్)లు ఎంబీబీఎస్, ఆపై చదువులు చదువుకొని వైద్యులుగా సేవలందించారు.

పీహెచ్డీ & పోస్టుగ్యాడ్రుయెట్లు

మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ పీహెచ్డీ పూర్తి చేయగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news