నేను ఓడిపోతానని ముందే తెలుసు : ఎర్రబెల్లి దయాకర్ రావు

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసని, అందుకే ఎన్నికలకు 3 నెలల ముందే తన సీటు మార్చాలని కేసీఆర్ను కోరానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తోందని కేసీఆర్కు చెప్పానని, మరో 20 స్థానాల్లో సిట్టింగ్లన్ను మార్చాలని ముందే సూచించానని అన్నారు. ఇందులో భాగంగానే తన స్థానం కూడా మార్చాలని కోరారన్నారు. ప్రజల అభిప్రాయం తనకు తెలుసని.. వరంగల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.

రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇక, అబద్ధాలు, మోసాల్లో కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కేటేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మోడీతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వార్థపరుడు, ద్రోహి అని ధ్వజమెత్తారు. నీకు విలువలుంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. ప్రజలు ఒక్కసారి మోసపోయారని, మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news