తెలంగాణకు ఇకపై బీఆర్ఎస్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

-

యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం వరంగల్ జిల్లాకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులతో పాటు ఆదిలాబాద్ మాజీ సర్పంచ్‌లు, జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆయన అనుచరులు బీజేపీ పార్టీలో చేరారు.కాగా వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ….. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు .

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది లేదు, ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదని ఆయన అన్నారు. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని, ఆ పార్టీకి ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం పెరిగిందని, ప్రపంచ దేశాల ముందు ఇండియా నవ్వుల పాలైందని ఆయన గుర్తుచేశారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాని నిర్మించుకుందామని, దీనికి ప్రజల మద్దతు కావాలని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news