భీమ్లా నాయక్ పాటపై తెలంగాణ పోలీసులు సీరియస్ !

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం భీమ్లా నాయక్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గెటప్‌ కనిపించనున్నారు. అయితే.. నిన్న పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే నేపథ్యం లో ఈ సినిమా నుంచి ఓ పాటను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ పాట లో పోలీసుల గురించి రాసిన కొన్ని పదాల పై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పాట లో రామ జోగయ్య శాస్త్రి రాసిన కొన్ని పదాలు పోలీసులను కించ పరిచే విధంగా ఉన్నాయని హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌ లో తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొటమని చురకలు అంటించారు.

అంతేకాదు.. పోలీసుల గురించి వివరించేందుకు రచయింతకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అంటూ డీసీపీ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. డీసీపీ చేసిన ఈ ట్వీట్‌ పై భీమ్లా నాయక్‌ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించగా.. థమన్‌ మ్యూజిక్‌ అందించారు.