కమలానికి అలెర్ట్..ఓవర్ టూ కాంగ్రెస్?

-

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనుకున్నదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే…బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య ఓట్లు చీలిపోవాలి. ఆ దిశగానే కేసీఆర్ పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు బలంగా తయారవుతున్నాయి. పైగా రెండు ప్రతిపక్షంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలకు పడే ఓట్లు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు..అందుకే మొన్నటివరకు బలం తక్కువ ఉన్న బీజేపీని కేసీఆర్ బాగానే హైలైట్ చేశారు. దీంతో బలంగా ఉన్న కాంగ్రెస్ రేసులో వెనుకబడింది.

ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చెప్పి కాంగ్రెస్ సైతం గట్టిగానే ఫైట్ చేస్తుంది. బీజేపీ-టీఆర్ఎస్‌లు ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళడం లేదనే చెప్పాలి. పైగా బీజేపీ దూకుడుగా రాజకీయాలు నడుపుతోంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేస్తుంది. అలాగే కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కూడా స్టార్ట్ చేసింది..టీఆర్ఎస్‌లో ఉన్న బలమైన నాయకులని లాగేయాలని చూస్తుంది. అటు కాంగ్రెస్‌లో ఉన్న నాయకులని కూడా బీజేపీలోకి తీసుకురావాలని చూస్తుంది.

అయితే బీజేపీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. బీజేపీ కంటే ముందే నాయకులని చేర్చుకోవాలని కాంగ్రెస్ ట్రై చేస్తుంది. ఇప్పుడుప్పుడే మళ్ళీ గాడిలో పడి, ఇతర పార్టీ నాయకులని చేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘం నేత గాలిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు.

అటు సీనియర్ నేత డి. శ్రీనివాస్ సైతం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన తనయుడు సంజయ్ సైతం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చేరికలతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు రావడం ఖాయమని చెప్పొచ్చు. అలాగే ఇది ఓ రకంగా బీజేపీకి రెడ్ అలెర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ. కాబట్టి బీజేపీ ఇంకా జాగ్రత్తగా రాజకీయం చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version