saamanyudu : విశాల్ సామాన్యుడు ట్రయిల‌ర్ అవుట్

-

త‌మిళ స్టార్ హీరో విశాల్ హీరోగా వ‌స్తున్న సామాన్యుడు ట్ర‌యిల‌ర్ కాసేప‌టి క్రితం విడుద‌ల అయింది. థుప శ‌ర‌వ‌ర‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌స్తుంది. అలాగే ఈ సినిమా ను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై హీరో విశాల్ నిర్మిస్తున్నాడు. అలాగే హీరోయిన్ గా డింపుల్ హ‌యాతీ న‌టిస్తుంది. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ సినిమా కు సంగీతాన్ని అందుస్తున్నాడు. అయితే ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగు లో కూడా విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ కూడా రెండు భాషాల‌లో విడుద‌ల చేశారు.

కాగ ఈ సినిమా క్రైమ్ థ్రిల్ల‌ర్, పొలిటిక‌ల్ డ్రామా గా తెర‌కెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో హీరో విశాల్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసు అధికారిగా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ లో హీరో విశాల్ ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. కాగ ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌ల అయిన థీమ్ మ్యూజిక్ తో రెండు భాషాల ప్రేక్ష‌కుల‌ను విశాల్ ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నారు. కాగ ఈ సినిమా జ‌న‌వ‌రి 26 న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించింది. కానీ క‌రోనా కార‌ణంగా ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version