భారీ వర్షాలు : విద్యుత్ శాఖ కీలక ప్రకటన

-

తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ ను ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభకార్ రావు అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయిది. 12 వేల మెగా వాట్స్ నుండి 4300 మెగావాట్స్ కి డిమాండ్ పడిపోయింది. దీంతో వోల్టేజ్ పెరిగిన నేపధ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ డిమాండ్ లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తు లోడ్ డిస్స్పాచ్ చేయిస్తున్నారు సిఎండి ప్రభకార్ రావు.

విద్యుత్ డిమాండ్ తగ్గడం థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశామని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయమని అయన కోరారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన, సెల్లార్ లకు నీళ్లు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలుపమని ఆయన కోరారు. ఎక్కడైనా వర్షము నీరు సెల్లార్ లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుందని అయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news