కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్

-

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన తండ్రి కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ముందు కేటీఆర్ తన పుట్టిన రోజును హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలోని 100 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు కేటీఆర్ అందజేశారు. దీంతో విద్యార్థినులంతా ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా కేటీఆర్ ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేశారు. ఇక కేటీఆర్ కి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు ఫోటోలు టిఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version