కాకినాడ నుంచి ఫిలిప్పిన్స్ కి తెలంగాణ బియ్యం..!

-

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పిన్స్ కి వెళ్తున్నాయి. ఫిలిప్పిన్స్ కి 8లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు. లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఫిలిప్పిన్స్ కి వెళ్తున్న షిప్ ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ విస్తరన గురించి సమాచారం లేదని తెలిపారు. ఫిలిప్పిన్స్ కి 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం. అందులో భాగంగా తొలివిడతగా 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందన్నారు. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తరువాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపారు. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులపై చర్చిస్తానని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news