సంక్రాంతి పండుగ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ పండుగ నేపథ్యంలో… హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ వాసులు.. సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బస్సు, రైలు, ప్రైవేట్ వాహనాలు ఇలా ఏది దొరికితే… అదే అన్నట్లుగా అన్నిటిని ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. అటు ప్రైవేట్ బస్సులు ఇదే అదునుగా చేసుకుని.. టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచేశాయి.
ఇలాంటి తరుణంగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ… ఏపీకి వెళ్లే వారికి శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ 4 వేల 360 ప్రత్యేక బస్సులను నడపనుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన చేశారు. కోవిడ్ వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో నేపథ్యంలో అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఆర్టీసీని నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఏపీ కి వెళ్లేవారు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. తక్కువ ధరలతో… గమ్య స్థానాలకు చేరాలని తెలిపారు.