తెలంగాణా ఆర్టీసి సంచలన నిర్ణయం…!

-

తెలంగాణా ఆర్టీసిలో ప్రక్షాళన దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కు బస్సులను ఆర్టీసి నుంచి పంపించాలి అనే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. హైదరాబాద్ లో పాత బస్సులను తప్పించే యోచన చేస్తుంది. ఈ నేపధ్యంలో 800 పాత బస్సులను ఆర్టీసి రద్దు చేసింది.

త్వరలోనే వాటి స్థానంలో కొత్త బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టె ఆలోచన చేస్తున్నారు. వాటికి నిర్వహణ వ్యయం ఎక్కువ కావడంతో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెల్లో 1280 బస్సుల్ని కూడా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికులు ఇబ్బంది పడినా త్వరలోనే వాటి స్థానంలో కొత్త అద్దె బస్సులను ప్రవేశ పెట్టె ఆలోచన చేస్తుంది ఆర్టీసి యాజమాన్యం. ప్రస్తుతం ఆర్టీసీలో 2100 అద్దె బస్సులు ఉన్నాయి.

కొత్తగా 1334 బస్సులను 15 రోజుల్లో తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో వీటిని ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో మాత్రం 54లు అద్దె బస్సులు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రద్దు అయిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనే ఆలోచనలో ఆర్టీసి ఉందని అంటున్నారు. ప్రయాణికులు ఒక 15 రోజులు కొంచెం ఇబ్బంది పడాలని ఆ తర్వాత కొత్త బస్సులు వస్తాయని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version