తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రాఖీ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఆర్టీసీ సంస్థ తీవ్రంగా ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. వాటిలో మాత్రమే 30% ధరలు పెంచినట్లు వెల్లడించింది.

రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి చార్జీల పెంపు లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. స్పెషల్ బస్సుల్లో చార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని వివరణ ఇచ్చింది. పండుగలు వచ్చినప్పుడల్లా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పండుగలు అయిపోయాక యధావిధిగా సాధారణ బస్సులే నడుస్తాయని స్పష్టం చేసింది తెలంగాణ ఆర్టీసీ.