బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి : ప్రధాని మోడీ

-

తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ హామీని నెరవేర్చుకున్నాం. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కి తెలంగాణలో విముక్తి లభించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం అన్నారు. వాగ్దానం ఇచ్చామంటే అది అమలు అవుతుంది. మహిళల రిజర్వేషన్లు, వన్ ర్యాంకు వన్ నేషన్, అయోధ్య రామమందిరం నిర్మాణం వంటి హామీలను నెరవేర్చుకున్నాం.

గ్యారెంటీలను పూర్తి చేయడమే మోడీ గ్యారెంటీ. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని ఇచ్చింది. కానీ అది నిలబెట్టుకోలేదు. కానీ బీజేపీ తప్పుకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది అని తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. బీఆర్ఎస్ కి డబ్బులు అవసరం అయితే.. నీటి ప్రాజెక్టులను ప్రారంభించి.. తెలంగాణ అభివృద్ధి సొమ్మును జేబుల్లోకి నింపుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news