ఎన్నికల ఓటర్ల జాబితా లో ఒక్కోసారి ఒకరి బదులు వేరొకరి ఫోటోలు వస్తుండడం ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. అయితే ఓటర్ల జాబితా వరకు అయితే పర్లేదు. కానీ 10 వ తరగతి విద్యార్థి హాల్ టికెట్ లో అతని ఫోటో కి బదులు పబ్ జీ గేమ్ ఇమేజ్ ప్రత్యక్షమవ్వడం విశేషం. విద్యార్థుల జీవితానికి మలుపులాంటి టెన్త్ క్లాస్ హాల్ టికెట్‌పై పబ్ జీ గేమ్ ఇమేజ్ ప్రత్యక్షమైంది. అంతేకాకుండా విద్యార్థి పేరు చివరన పబ్ జీ అని తగిలించారు. ఇక విద్యార్థి తండ్రి పేరు చివరన పబ్ జీ లైఫ్ అని జోడించారు. దీంతో ఈ హాల్ టికెట్ చూసిన ప్రతీఒక్కరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాధారణంగా అప్పుడప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే ఒక విద్యార్థి జీవితంలో ఏంతో కీలకంగా వ్యవహరించే 10 వ క్లాస్ హల్ టికెట్ పై అన్ని తప్పులతో విద్యార్థి పేరు,తండ్రి పేరు, ఫోటో అన్ని తప్పుగా ప్రచురించడం తో అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థమవుతోంది.హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన హిదాయత్ అనే విద్యార్థి ‘S ది స్కూల్’ అనే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
అయితే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉండటంతో విద్యాశాఖ అధికారులు అతనికి హాల్ టికెట్ జారీ చేశారు. ఆ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ 2022114399. సదరు స్టూడెంట్‌కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ పేరు, ఏయే రోజు ఏయే పరీక్షలు ఉన్నాయన్న డీటైల్స్‌తో హాల్ టికెట్ ఇంటికి వచ్చింది. అయితే అందులో స్టూడెంట్ ఫొటో ఉండాల్సిన చోట పబ్ జీ గేమ్ ఫొటో ఉండడం తో ఇది చూసిన విద్యార్థి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులతో సంప్రదించారు. అయితే ఆ విద్యార్థి ఈ హాల్ టిక్కెట్ నెంబర్‌తో తెలంగాణ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో చెక్ చేసినప్పటికీ కూడా కూడా ఇదే డీటైల్స్ రావడం గమనార్హం.