రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎక్కడికక్కడ తమ్ముళ్లు పార్టీని వీడి పారిపోతు న్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తాలూకు ఎఫెక్ట్ పార్టీని ఇంకా వేధిస్తూనేఉందనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ భారీ ఎత్తున ఇబ్బంది పడుతోంది. అయితే, పలు జిల్లాల్లో సీని యర్లు ఉన్నప్పటికీ.. కూడా పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోం ది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ పార్టీకి త్రిమూర్తుల వంటి నాయకు లు ఉన్నా రు. అయినప్పటికీ.. పార్టీ పరువు పోతున్నా.. వీరు పట్టించుకోవడం లేదు.
నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి మంచి బలం, బలగం అన్నీ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి మెజారిటీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, గత ఎన్నికల్లో మాత్రం పార్టీ ఇక్కడ చిత్తుగా ఓడిపోయింది అయితే, రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, ఎన్నికల్లో పరాజయం తర్వాత అన్ని జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా తమ్ముళ్లుపార్టీ నుంచి బయ టకు వచ్చారు. వస్తున్నారు. కరడుగట్టిన టీడీపీ అబిమానులు కూడా పార్టీ నుంచి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ జిల్లాలోని పార్టీకి నెంబర్ 2 అనదగిన నాయకుడు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్, వ్యూహకర్త యనమల రామకృష్ణుడు అండగా ఉన్నారు. అదేవిధంగా హోం శాఖ మాజీ మంత్రి చినరాజప్ప కూడా ఈ జిల్లా నాయకుడే. పార్టీలో సీనియర్ నాయకుడు, ఇక, మరో నాయకుడు, వైసీపీ మాజీ నాయకుడు జ్యోతుల నెహ్రూ కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. వీరు జిల్లాకు మూడు వైపుల ముగ్గురు అన్నట్టుగా ఉన్నారు. అయినప్పటికీ.. పార్టీ బలహీన పడుతున్నా.. తమ్ముళ్లు క్యూ కట్టుకుని పార్టీని వీడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరికివారు తమకెందుకులే అని సరిపెట్టుకుంటున్నారు. మరి ఇలా ఉన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఏమాత్రం ప్రయత్నించకపోవడం గమనార్హం.