పశ్చిమ లండన్ లో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో యూకే కోర్టు మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించినట్లు తెలుస్తుంది. హౌన్ స్లో ప్రిన్స్ రీజెంట్ రోడ్ లో నివసిస్తున్న 36 ఏళ్ల నికుంజ్ కుమార్ వైద్ అనే భారత సంతతి వ్యక్తి మైనర్ బాలిక పై రెండు సార్లు వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో లండన్ లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు లో విచారణ జరపగా వైద్ ఆ మైనర్ బాలిక ను రెండు సార్లు అసభ్యంగా తాకినట్లు తేలింది. ఇంట్లో పెద్దలు లేనప్పుడు వైద్ ఆ అమ్మాయిని లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా తాకాడని అయితే రెండవసారి ఇలాంటి చర్యకు పాల్పడినప్పుడు ఇది టాప్ సీక్రెట్ అంటూ ఆ బాలిక తో చెప్పి ఎవరికీ చెప్పొద్దూ అంటూ అన్నట్లు గా కూడా రుజువైంది. అయితే ఆ బాలిక తల్లి తో ఈ విషయాలన్నీ చెప్పడం తో వెంటనే ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
దీనితో వైద్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వైద్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించడంతో పాటు బాలిక తనపై తప్పుడు వాదనలు చేసిందని మండిపడ్డాడు. అయితే బాలిక ఆరోపణలు రుజువు అవ్వడం తో కోర్టు అతడికి మూడేళ్ళ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.