మీ స్పందన చూస్తుంటే..మళ్లీ కేసీఆర్ దే అధికారం అనిపిస్తుందని మంత్రి KTR అన్నారు. తెలంగాణ రాష్ట్ర CII వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఈ మీటింగ్ కు హాజరు అవుతున్నానని చెప్పారు కేటీఆర్.
2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మాకు అధికారాన్ని కట్టబెట్టండని కోరారు. మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.హైదరాబాద్ ఫార్మసిటీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నానని… జినోమ్ వ్యాలీ మెడికల్ డివైసెస్ పార్క్ ను విస్తరిస్తున్నామని ప్రకటించారు. భారతదేశానికి హైదరాబాద్ లాంటి నగరాల అవసరం ఉందని… కొంగరకలాన్ లో ఫాక్స్ కామ్ 200 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది …లేఖ విడుదల చేసిందని గుర్తు చేశారు కేటీఆర్. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని… గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు ఆసక్తి చూపండన్నారు కేటీఆర్.