ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ 2020 ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) శుక్రవారం అర్థరాత్రి ప్రకటించింది. జెఇఇ (మెయిన్) లో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 శాతం స్కోరు సాధించారు. వారిలో అత్యధికంగా ఎనిమిది మంది విద్యార్థులు తెలంగాణకు చెందినవారని ఎన్‌టిఎ తెలిపింది. జెఇఇ (మెయిన్) టాపర్స్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు.
“గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో సహకార సమాఖ్యవాదం మరియు యువ ఆత్మా నిర్భర్ భారత్ యొక్క స్ఫూర్తికి ఇది నిదర్శనం. కరోనా భయం ఉన్నప్పటికీ మనం నిరూపించుకున్నాం అని అని పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. జెఈఈ (మెయిన్స్) టాపర్స్ ను నేను అభినందిస్తున్నాను. జేఈఈ పరీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలాగే 4 రోజుల్లో ఫలితాలను ప్రకటించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.