తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ గా నిలిచింది. అభివక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలు ఉండగా, 2022-23 నాటికి రూ. 3.17 లక్షలకు చేరిందని ‘నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్’ నివేదికలో వెళ్లడైంది.
అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.86, 647 నుంచి రూ.1.72 లక్షలకు చేరింది. చిన్న రాష్ట్రమైన గోవాను మినహాయిస్తే తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా కేరళ, కర్ణాటక, చత్తీస్గడ్, హర్యానా, ఒడిశా తమిళనాడు ఉన్నాయి.